![]() |
![]() |

బుల్లితెర మీద రౌడీ రోహిణి అనే పేరు వింటే చాలు ఎవ్వరికైనా నవ్వు రావాల్సిందే. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి రోహిణి ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద కనిపించింది. అసలు విషయం ఏమిటి అంటే తనకు 2016 లో యాక్సిడెంట్ అవడంతో కాలిలో స్క్రూ, రాడ్ వేసారట. ఐతే ఇప్పుడు తన స్కిట్స్ కి, డాన్స్ పెర్ఫార్మ్ చేయడానికి అవి ఇబ్బందిగా మారాయని, కాలి మోకాలి నుంచి మణికట్టు వరకు బాగా పెయిన్ వస్తుండడంతో వాటిని సర్జరీ చేయించుకుని రిమూవ్ చేయుంచుకోవడానికి వెళ్ళింది.
రోహిణి హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది..అక్కడ సర్జరీకి అవసరమైన అన్ని ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ ఫైనల్ గా సర్జరీ చేసి వాటిని రిమూవ్ చేయడం కుదరకపోయేసరికి కాలికి కట్టు కట్టి రూమ్ కి షిఫ్ట్ చేశారు డాక్టర్స్. "స్క్రూ తియ్యడానికి కుదరదని చెప్పారు. ఎందుకంటే స్క్రూ చుట్టూ బోన్ ఫార్మ్ ఐపోయింది. ఆ స్క్రూ తియ్యాలంటే బోన్ డామేజ్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఆ స్క్రూని ఉంచుకోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదు... కొంచెం జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పారు" అంది రోహిణి వాళ్ళ అమ్మ.

ఇక తన ఫ్రెండ్ ఆ పరిస్థితిలో ఉండేసరికి జబర్దస్త్ నుంచి మరో లేడీ కమెడియన్ పవిత్ర కూడా రోహిణి దగ్గరే ఉండి చూసుకుంది. "ఇప్పటికే చాలా లేట్ ఐపోయింది. ఎప్పటికప్పుడు కాలిలోంచి ఈ స్క్రూని, రాడ్ ని తీయించేసుకుందామని అనుకుంటూ ఉన్నా కానీ..టైం సెట్ కావడం లేదు..షూటింగ్స్ బిజీలో హాస్పిటల్ కి వెళ్లడం నెగ్లెక్ట్ చేసాను. వీటిని సర్జరీ చేయించుకుని ఎప్పుడైనా తీయించుకోవచ్చు కానీ అవకాశం పొతే మళ్ళీ రాదు అనుకున్నా..అలా అనుకున్నందుకు ఇప్పుడు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు..ఏదో అనుకుని వస్తే ఏదో అయ్యింది. పైకి నవ్వుతున్నాను కానీ నాకు లోపల చాలా బాధగా ఉంది..ఫ్రెండ్స్ నేను త్వరగా రికవరీ కావాలని మీరు కూడా నా కోసం ప్రే చేయండి " అంటూ తన కాలికి కట్టిన కట్టును చూపించింది రోహిణి.
![]() |
![]() |